ప్రివ్యూ - ఫోటోల్లోంచి హ్యాష్‌ట్యాగ్స్‌, క్యాప్ష‌న్స్ జ‌న‌రేట్ చేసే యాప్ - కాప్షన్ 8

మంచి ఫోటో తీశారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఎఫ్‌బీలో లేదా ట్విట్టర్‌లోనో పోస్ట్ చేయాలనుకున్నారు. కానీ దానికి ఏం క్యాప్షన్ పెట్టాలో, ఎలాంటి  హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వాలో తెలియడం లేదా? అయితే మీకు క్యాప్షన్ 8 అని ఆండ్రాయిడ్ యాప్ సహాయపడుతుంది. ఆండ్రాయిడ్‌లో ఫోటోలకు ఇన్‌స్టంట్‌గా క్యాప్షన్లు, హ్యాష్‌ట్యాగ్స్‌ సమకూర్చే యాప్ గురించి తెలుసుకుందాం.  

క్యాప్ష‌న్ 8
ప్లే స్టోర్‌లోకి వెళ్లి క్యాప్షన్ 8 (Caption 8) ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్లోడ్ చేసి మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయండి. 
* యాప్‌ను  ఓపెన్ చేసి స్క్రీన్ మీద టచ్ చేస్తే ఫోటో ఓపెన్ అవుతుంది. లేదా మొబైల్ కెమెరాతో ఫోటో తీయండి. 
* ఫోటో తీయగానే సుమారు 13 హ్యాష్‌ట్యాగ్స్‌, క్యాప్షన్ ఫోటోకు యాడ్ అవుతాయి. 
* ఉదాహరణకు మీరు ఒక ఒక డ్రెస్ ఫోటో తీస్తే ఫ్యాషన్, ఫాలో, పిక్ అఫ్ ది డే,  ఫ్యాషన్ వరల్డ్, టుడేస్ ఫ్యాషన్ ఇలా రకరకాల హ్యాష్‌ట్యాగ్స్‌ ఫోటోకు యాడ్ అవుతాయి. 
* మీకు ఏదైనా హ్యాష్‌ట్యాగ్ ఫోటోకు సంబంధం లేనట్లుగా ఉందనిపిస్తే వేరే దాంతో రీప్లేస్ చేయొచ్చు. 
* మీ ఫోటోతో హ్యాష్‌ట్యాగ్స్ కావాలనుకుంటే యాడ్ అనే ఆప్షన్ నొక్కి యాడ్ చేసుకోవచ్చు. 
* ఇప్పుడు హ్యాష్‌ట్యాగ్స్‌, క్యాప్షన్ ను కాపీ చేసి సోషల్ మీడియాలో మీ ఫోటోతో పాటు షేర్ చేయొచ్చు. 
* అంతేకాదు యాప్‌లో హ్యాష్‌ట్యాగ్స్ ప్రిఫ‌రెన్స్ కూడా  యాడ్ చేసుకోవచ్చు. యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫోన్ హ్యాష్‌ట్యాగ్స్‌. లొకేషన్ హ్యాష్‌ట్యాగ్స్‌, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్‌లో నుంచి మీకు కావలసిన దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు.

న‌చ్చిన క్యాప్ష‌న్ పెట్టుకోండి
క్యాప్ష‌న్ 8 యాప్‌లో ఫోటో క్యాప్షన్ కూడా వస్తుంది. అది మీకు నచ్చకపోతే లెఫ్ట్‌కి స్వైప్ చేస్తే మరో కొత్త క్యాప్షన్ జనరేట్ అవుతుంది. అలా మీకు నచ్చిన క్యాప్షన్ వచ్చేవరకు స్వైప్ చేస్తూ ట్రై చేయొచ్చు. 

కోట్స్ కూడా..
ఈ యాప్ హోం పేజీలో కోట్స్ కూడా ఉంటాయి. పేజీ కింది భాగంలో ఉండే కోట్స్ బటన్‌ను టాప్ చేస్తే కోట్స్ కనిపిస్తాయి. నచ్చితే కాపీ చేసుకుని వాట్సాప్ లేదా ఫేస్‌బుక్‌లో షేర్  చేసుకోవచ్చు.

ఫోటోల‌కు హ్యాష్‌ట్యాగ్స్‌ క్యాప్ష‌న్స్  హ్యాష్‌ట్యాగ్స్ జ‌న‌రేట్ చేసే యాప్‌ క్యాప్ష‌న్ 8 Caption 8 Hash tags generating app captionsÂ